IPL 2025 Schedule : 65 రోజుల్లో 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఇదే..
IPL 2025 Schedule | వేసవి సెలవుల్లో క్రికెట్ అభిమానులకు ఎగిరి గంతేసే వార్త ఇది.. త్వరలో ఐపీఎల్ 2025 హంగామా మొదలుకానుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న ఈ సీజన్ మొదలు కానుంది. 65 రోజుల పాటు కొనసాగే ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మే 18వ తేదీతో లీగ్ దశ ముగిసిపోతుంది. మే 20 నుంచి 25 వరకు ప్లే ఆఫ్స్ జరుగుతుఆయి. మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఉత్కంఠభరితంగా ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈడెన్ గార్డెన్‌లోనే క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌కు సైతం నిర్వహించనున్నారు.
ఈ సీజన్‌లో తొలిమ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఉంది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్చి 23న తన సొంత మైదానం ( ఉ...




