DA For TGSRTC Employees | ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంచనున్న సర్కార్
DA For TGSRTC Employees : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికి 2.5 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంచనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Transport Minister Ponnam Prabhakar) వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల ( RTC employees) సంక్షేమమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుపర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
DA For TGSRTC Employees : కలిగే ప్రయోజనాలు
ఉద్యోగులకు DA అనేది వారి జీవనోపాధికి సంబంధించిన కీలకాంశం. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో 2.5 శాతం డీఏ (2.5 per cent Dearness Allowance (DA) పెంపు నిర్ణయం ఎంతో ప్రధాన్యాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన 2.5 శాతం పెంపు ద్వారా ఆర్టీసీలో పని చేస్తున్న 40 వేల మంది ఉద్యోగులు లబ్ధి చేక...
