MLC Candidates ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్
Telangana MLC Candidates | ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతిని ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. విజయశాంతితో పాటు సినియర్ నాయకుడు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లను కూడా అభ్యర్థులుగా అవకాశం కల్పించింది. మొత్తం నాలుగు స్థానాల్లో మిగిలిన ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. ఈ మేరకు వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వివరాలను ఆదివారం ప్రకటించారు.
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు (Telangana MLC Candidates) ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఆయా స్థానాలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 10వ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నామినేషన్ల ఉపసంహరణకు 13 వరకు అవకాశం ఉంది. 20న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎమ్మెల్యేల సంఖ...


