KCR | వచ్చే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ సార్..
ప్రకటించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
చాలా రోజుల తర్వాత మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Ex CM KCR )రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఈనెల 12 నుంచి శాసన సభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కీలక ప్రకటన చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని ప్రకటించారు. గవర్నర్ అడ్రెస్ కార్యక్రమంలో కూడా ఆయన అటెండ్ అవుతారని తెలిపారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ (Dasuju Sravan) సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు హాజరయ్యారు. అనంతరం మ...

