TG Weather Report : ఎండలు దంచికొడుతున్న వేళ.. చల్లని కబురు
22 నుంచి 25 వరకు కురిసే అవకాశం
హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
TG Weather Report : వేసవి పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే సూర్య ప్రతాపానికి ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ మండుటెండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఇదే సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.
హైదరాబాద్‌లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కరుస్తాయని వెల్లడించింది. ఇదిలా ఉండగా, బుధవారం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 41 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మంచిర్యా...
