Sarkar Live

Day: March 22, 2025

Urinates on ATM | ఏటీఎంపై మూత్ర విస‌ర్జ‌న.. హైద‌రాబాద్‌లో విచిత్ర ఘ‌ట‌న‌
State

Urinates on ATM | ఏటీఎంపై మూత్ర విస‌ర్జ‌న.. హైద‌రాబాద్‌లో విచిత్ర ఘ‌ట‌న‌

Urinates on ATM | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రాజ్‌భ‌వ‌న్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్ర‌బుద్దుడు డ‌బ్బులు డ్రా చేశాక అదే ఏటీఎంపై మూత్ర విస‌ర్జ‌న చేశాడు (Urinates on ATM). ఈ ఘ‌ట‌న మార్చి 10న చోటుచేసుకోగా ఆల‌స్యంగా ఈరోజు వెలుగులోకి వ‌చ్చింది. Urinates on ATM : సంఘటన ఎలా జరిగింది? ఆ రోజు సాయంత్రం ఓ వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించి తన ఖాతా నుంచి నగదు డ్రా చేశాడు. ఆ త‌ర్వాత అత‌డు ఏటీఎం మిషిన్‌పై మూత్ర విసర్జన చేశాడు. దీనివల్ల మిషిన్‌లోని సెన్సార్ దెబ్బతింది. బ్యాంక్ సిబ్బంది రోజువారీ తనిఖీలు నిర్వహించినప్పుడు మిషిన్ సరిగ్గా పనిచేయకపోవడం గమనించారు. మిషిన్ సెన్సార్ ఎందుకు పనిచేయడం లేదో తెలుసుకోవడానికి సాంకేతిక నిపుణులు పరిశీలింగా, దాని పైభాగంలో మూత్రం వాసన వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే బ్యాంక్ సిబ్బంది ఏటీఎంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌(CCT...
Electricity Tariff | విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌
State

Electricity Tariff | విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌

Electricity Tariff in Telangana | హైదరాబాద్: వేసవిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి పెరుగుతున్నప్పటికీ, 2025-26 సంవత్సరానికి విద్యుత్ ఛార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌పై రాష్ట్ర ప్రభుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఆర్థిక సంవ‌త్సరంలో విద్యుత్ చార్జీల‌ను పెంచేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (ERC) చైర్మన్ జస్టిస్ డి. నాగార్జున్ ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ ఇంధన కార్యదర్శి ఎస్. ప్రియదర్శిని హాజ‌ర‌య్యారు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ వినియోగదారులపై భారం పడకుండా విద్యుత్ సంస్థలకు పూర్తి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. Electricity Tariff : ఆర్థిక మద్దతు కొనసాగిస్తాం.. ఏ కేటగిరీకీ విద్యుత్ ఛార్జీల పెంపు (Electricity Tariff ) ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2003 విద్యుత్ చట్టం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఆర్థిక సహాయం అందించడానికి కట్టుబడి...
New UPI Rules | ఏప్రిల్ 1 లోపు ఈ పని చేయండి.. లేకపోతే మీ UPI పనిచేయదు.
Business

New UPI Rules | ఏప్రిల్ 1 లోపు ఈ పని చేయండి.. లేకపోతే మీ UPI పనిచేయదు.

New UPI Rules : UPI లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ నిబంధనల్లో కొన్నిమార్పులు జరగనున్నాయి. కొత్త నియమాలు మీపై ప్రభావం చూపవచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వంటి రిటైల్ చెల్లింపు వ్యవస్థలను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, UPI ఖాతాలకు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ ఎక్కువ కాలం ఇనాక్టివ్ గా ఉంటే దానిని ఏప్రిల్ 1 నుండి బ్యాంక్ రికార్డుల నుంచి తొలగించబడతాయి. అందువల్ల, ఇప్పుడు యాక్టివ్ గా లేని మొబైల్ నంబర్‌లను ఉపయోగించి Paytm, Google Pay మరియు PhonePe వంటి UPI-ఆధారిత యాప్‌లకు సభ్యత్వం పొందిన వారు వెంటనే వారి ప్రస్తుత మొబైల్ నంబర్‌లను సిస్టమ్‌లో నమోదు చేసుకోవాలి. అంతకుముందు, పేటీఎం, గూగుల్ పే వంటి యుపిఐ లావాదేవీలను చేసే బ్యాంకులు, యూపీఐ సంస్థలు తమ కస్టమర్ల మొబైల్ నంబర్ రికార్డులను కనీసం వారానికి ఒకసారి తప్పనిసరిగా అప్ డేట్ చేయాలని ఆదేశించింది. New ...
error: Content is protected !!