Hyderabad Sexual Assault | ట్రైన్‌లో దారుణం.. బాలికపై లైంగిక దాడి
Sexual Assault : హైదరాబాద్ (Hyderabad)లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక (Minor Girl)ను ట్రైన్‌లో ఓ యువకుడు లైంగిక దాడి (Train Sexual Assault) చేశాడు. ఆ దృశ్యాలను తన మొబైల్‌లో వీడియో తీశాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secundrabad Railway Station) పరిధిలో జరగ్గా బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు (Railway Police) నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Sexual Assault : ఘటన ఎలా జరిగింది?
ఒడిశాలోని రక్సెల్ పట్టణానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ (Hyderabad)లో ఉన్న ప్రముఖ ప్రదేశాలను చూడటానికి వచ్చింది. కుటుంబ సభ్యులు రక్సెల్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రాత్రి 2 గంటల సమయంలో 15 ఏళ్ల బాలిక ట్రైన్‌లోని వాష్‌రూమ్‌కు వెళ్లింది. ఆమె ఒంటరిగా వెళ్లడాన్ని గమనించిన ఓ యవకుడు మెల్లగా ఫాలో అయ్యాడు. వాష్‌రూమ్‌లోకి వెళ...




