SC subcategorisation | ఎస్సీల్లో ఉపవర్గాల వారీగా విభజనకు శ్రీకారం..
SC subcategorisation : తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారి రాష్ట్రంగా ఎస్సీ (షెడ్యూల్డ్ కాస్ట్) వర్గాల్ని ఉపవర్గాలుగా (subcategorisation ) విభజించి, వెనుకబాటును బట్టి రిజర్వేషన్లు (Rationalization of Reservations) కల్పించే చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇది ఏ ఇతర రాష్ట్రం చేయలేని గొప్ప ప్రయోగం. సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు, తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly), గవర్నర్ ఆమోదం అనంతరం అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు అంబేద్కర్ (BR Ambedkar) జయంతి సందర్భంగా ఈ మేరకు ఇవాళా ఉత్తర్వులు (GO) విడుదల చేసింది.
చట్టం అమలుకు సర్కారు అడుగులు
సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న ఎస్సీ ఉప కులాల వారీగా రిజర్వేషన్లపై తీర్పు చెప్పింది. అత్యంత వెనుకబడిన ఎస్సీ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ (Reservations) ఇవ్వొచ్చు అని పేర్కొంది. ఈ క్రమంలో రా...

