Mangalagiri AIIMS | వైద్యశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
Mangalagiri AIIMS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంగళగిరి(Mangalagiri)లోని ఎయిమ్స్ (All India Institute of Medical Sciences (AIIMS) ఆస్పత్రి అభివృద్ధికి కేంద్రం (Central Government) పటిష్ట చర్యలు చేపడుతోంది. ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ వృద్ధికి, అవసరమైన శాశ్వత సిబ్బందిని నియమించేందుకు (appointment of permanent staff members) కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekha) చర్యలు చేపట్టారు. గతంలో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పూర్తయినప్పటికీ సమర్థంగా పని చేయడానికి అవసరమైన శాశ్వత ఉద్యోగాల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీని పరిష్కారం కోసం కేంద్ర స్థాయిలో చొరవ తీసుకుంటోంది.
శాశ్వత సిబ్బంది లేక ఇబ్బందులు
Mangalagiri AIIMS ఆస్పత్రి అనేది అత్యాధునిక వైద్య సేవల ప్రాధాన్యతను కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ (central government healthcar...

