Artificial Intelligence | ఏపీలో అమలు చేయబోయే ఏఐ గవర్నెన్స్ ప్రయోజనాలేమిటి?
Artificial Intelligence : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ రంగంలో కీలక అడుగు వేసింది. మినిమం గవర్నమెంట్ - మాక్సిమమ్ గవర్నెన్స్ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence -AI) పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన 20 విభాగాల్లోంచి AI చాంపియన్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఈ వర్క్‌షాప్‌ను వధ్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ (WGDT) తో భాగస్వామ్యంగా నిర్వహిస్తున్నారు
Artificial Intelligence : చాంపియన్లుగా సీనియర్ అధికారులు
ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక అయ్యే శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 80 శాతం కార్యకలాపాలను AI సాయంతో నిర్వహించేందుకు మార్గం సుగుమమైంది. ఏఐ చాంపియన్స్ అనే పేరుతో సీనియర్ అధికారులను ఎంపిక చేస్తారు. వీరితో పాటు A...




