India Pakistan Tension : కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లో విద్యుత్ సరఫరా.. ఎల్‌ఓసిపై అలర్ట్
India Pakistan Tension | భారతదేశం-పాక్ ప్రతిష్టంభన : పాకిస్తాన్ దాడులతో భారత్ అలర్ట్ అయింది. వెంటనే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీనితో పాటు సైరన్లు కూడా మోగడం ప్రారంభించింది. ఈ సమయంలో ప్రజలు ఇళ్ల లోపలే ఉండి అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత సమయంలో, గురువారం ఉదయం, పాకిస్తాన్ నుంచి వస్తున్న అనేక రాకెట్లను భారత్ ధ్వంసం చేసింది . పాకిస్తాన్ భారత్ లోని 15 నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించింది. కానీ భారత సైన్యం అన్నింటిని భగ్నం చేసింది.
మే 7-8 రాత్రి డ్రోన్లు, క్షిపణుల సహాయంతో పాకిస్తాన్ అనేక భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించిందని ఆర్మీ ఆఫీసర్ కల్నల్ ఖురేషి వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. అవంతిపురా, శ్రీనగర్, ...



