Sarkar Live

Day: August 15, 2025

పోలీసుల‌కు ఓపెన్ ఎడ్యుకేషన్ – డిగ్రీ చేసుకునే సువర్ణావకాశం! – Open Education for Police
career, State

పోలీసుల‌కు ఓపెన్ ఎడ్యుకేషన్ – డిగ్రీ చేసుకునే సువర్ణావకాశం! – Open Education for Police

Open Education for Police : సమాజంలో పోలీసులకు ఉన్న‌త స్థానం ఉంది. ప్ర‌జ‌ల‌ రక్షణ, శాంతి భద్రతల‌ను కాపాడడం, నేరాలను అరిక‌ట్ట‌డంలో వీరే కీల‌కం. ఈ క్రమంలో పోలీసు ఉద్యోగ శిక్షణతోపాటు విద్య, నైపుణ్యం మరింత పెరగడం అనేది చాలా ముఖ్య‌మ‌ని భావించింది తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana government). దీంతో ఉద్యోగంలో చేరే ముందు డిగ్రీ చదివే అవకాశం పొందలేకపోయిన వారికి ఓ సువ‌ర్ణావ‌కాశం (Golden Chance) క‌ల్పించ‌నుంది. ఇందుకు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ (Dr. B.R. Ambedkar Open University)తో ఒప్పందం కుదుర్చుకుంది. చ‌దువుకోలేని వారికి సువ‌ర్ణవ‌కాశం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ యూనివర్సిటీ ఎల్లప్పుడూ ఉద్యోగుల‌కు, చదువు (education) కొనసాగించాలనుకునే వారికి అనువైన విధంగా కోర్సులు అందిస్తోంది. తాజాగా తెలంగాణ పోలీసుల‌కు ఆ సువ‌ర్ణ‌వ‌కాశాన్ని క‌ల్పించ‌నుంది. డిగ్రీ చేయని కానిస్టేబుళ్లు (Constabl...
UPSC Mains 2025 | ఈనెల 22 నుంచి సివిల్ మెయిన్స్‌.. అడ్మిట్ కార్డులు విడుదల
Career

UPSC Mains 2025 | ఈనెల 22 నుంచి సివిల్ మెయిన్స్‌.. అడ్మిట్ కార్డులు విడుదల

UPSC Mains 2025 | భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఒక‌టి. ఇవి ఈ నెల 22 నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలు (The Union Public Service Commission-UPSC) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నతస్థాయి హోదాల్లో నియామకాల కోసం నిర్వహిస్తారు. దేశంలోని లక్షలాది మంది అభ్యర్థులు దీనికి హాజరవుతారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా పరీక్షలు (UPSC Mains 2025) క్రమబద్ధంగా, కఠిన నియమావళి ప్రకారం జరుగనున్నాయి. ఐదు రోజులపాటు ప‌రీక్ష‌లు ఈ సంవత్సరం మెయిన్ పరీక్షలు ఐదు రోజులు కొనసాగనున్నాయి. ఆగ‌స్టు 22, 23, 24, 30, 31 తేదీల్లో జ‌ర‌గ‌నున్నాయి. ప్రతిరోజూ వేర్వేరు పేపర్లు, విభిన్న అంశాలపై పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు తమ ఎంపిక చేసిన సబ్జెక్టులు, తప్పనిసరి పేపర్లను రాయాల్సి ఉంటుంది. UPSC Mains 2025 : తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డెక్క‌డ? తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ‌లోని ...
Abortion in Telangana | తెలంగాణ‌లో పెరుగుతున్న అబార్ష‌న్లు.. ఐదేళ్ల‌లో 10 రెట్లు పెరుగుద‌ల‌
State, AndhraPradesh

Abortion in Telangana | తెలంగాణ‌లో పెరుగుతున్న అబార్ష‌న్లు.. ఐదేళ్ల‌లో 10 రెట్లు పెరుగుద‌ల‌

Abortion in Telangana : తెలంగాణలో పెరుగుతున్న అబార్ష‌న్ల (abortions) సంఖ్య ఆందోళ‌న క‌లిగిస్తోంది. 2024-25లో రాష్ట్రంలో మొత్తం 16,059 అబార్ష‌న్లు న‌మోద‌య్యాయి. 2020-21లో ఉన్న గణాంకాలతో పోలిస్తే ఇది పది రెట్లు పెరుగుదల అని ఆరోగ్య శాఖ లెక్క‌లు చెబుతున్నాయి. ఇదే క్ర‌మంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూడా అబార్ష‌న్ల (abortions) సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. 2020-21లో కేవలం 2,282 కేసులు ఉండగా, 2024-25లో ఈ సంఖ్య 10,676కు చేరింది. ఈ గణాంకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పార్లమెంట్‌లోని వర్షాకాల సమావేశం ( Parliament’s monsoon session)లో వెల్లడించింది. అత్యధికంగా న‌మోద‌వుతున్న రాష్ట్రాలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) డేటా ప్రకారం 2024-25లో అత్యధికంగా అబార్ష‌న్లు జరిగిన రాష్ట్రాలు ఇవి: మహారాష్ట్ర : 2,07,019 తమిళనాడు : 1,01,41...
Road accident | జ‌డ్చ‌ర్ల‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
Crime, Mahaboobnagar

Road accident | జ‌డ్చ‌ర్ల‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Road accident | మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల ( Jadcherla) మండలం మచారం సమీపంలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్ర‌మాదం (accident) జ‌రిగింది. లారీని ప్రైవేటు బ‌స్సు (Private bus) ఢీకొన‌డంతో డ్రైవ‌ర్ స‌హా ఇద్ద‌రు మ‌హిళా ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఉద‌యం 6 గంటల సమయంలో కడప నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ముందుకు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం (Road accident)చోటుచేసుకుంది. Road accident : ఎలా జ‌రిగిందంటే.. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సూర్యోద‌యానికి ముందు చీక‌టి ఇంకా అలుముకొని ఉన్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. బస్సు కొంత వేగంగా వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీ డ్రైవ‌రు ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో బ‌స్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి లారీ (lorry) వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో బస్సు ముందు ...
Rain Alert | నేడు రేపు భారీ వర్షాలు..
State

Rain Alert | నేడు రేపు భారీ వర్షాలు..

Rain Alert in Telangana | ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదులుతోందని ఐఎండీ తెలిపింది. దీనితో పాటు, ఉపరితల ఆవర్తనం, ద్రోణి కూడా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం 12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉండ‌గా బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, నల్గొండ, మహబూబ్ నగర్, ములుగు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ...
error: Content is protected !!