హైదరాబాద్-విజయవాడ 8లైన్ల రహదారిపై కీలక అప్‌డేట్ – Hyderabad Vijayawada expressway
Hyderabad Vijayawada expressway | హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం ఇక మరింత సులభం కానుంది. జాతీయ రహదారి (NH65)ని 8 లేన్‌లుగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికాగా, ఈ భారీ ప్రాజెక్ట్ పనులు 2026 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు ప్రకటించారు.
ప్రతి రోజు భారీ ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్న ఇరురాష్ట్రాల ప్రయాణికులకు ఇది భారీ ఊరట లభించనుంది. ఈ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో 17 బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి ఫ్లైఓవర్లు కూడా నిర్మించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఇటీవల దిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావించానని మంత్రి తెలిపారు.
కేవలం రెండు గంటల్లో హైదరాబాద్ నుండి విజయవాడకుకొత్త రహదారి పూర్తయిన తర్...

