Theft Gang | వింత దొంగల ముఠా గుట్టు రట్టు – నకిలీ వాంతులతో నగలు దోచే మహిళా గ్యాంగ్
Women Theft Gang | విచిత్రమైన మహిళా దొంగల ముఠా సంచలనాన్ని రేపింది. బస్సులు, ఆటోలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో తోటి మహిళా ప్రయాణికులను నమ్మించి, "వాంతి" చేస్తున్నట్లు నటిస్తూ నగలు, డబ్బులు కాజేస్తున్న ఆరుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. కనీవినీ ఎరుగుని రీతిలో కొత్త రహాలో నమ్మించి నగలు, డబ్బులు కాజేస్తున్న ఆరుగురు సభ్యులతో కూడిన పూర్తిగా మహిళా ముఠా ఉందంతం ఇది. ఈ మహిళల గుంపు వాంతి చేసుకుంటున్నట్లు నటించి భయాందోళనలకు గురిచేస్తుంటారు. ఆ తర్వాత తోటి ప్రయాణికులు పరధ్యానంలో ఉండగా వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పారిపోతారని అధికారులు వెల్లడించారు.
DCP శశాంక్ సింగ్ మాట్లాడుతూ, "వారిలో ఒకరు ఆటోగానీ బస్సుగానీ ప్రయాణిస్తుండగా ఎంతో కలివిడిగా ప్రవర్తిస్తూ కలివిడిగా మాటల్లో దింపుతారు. అందులో ఒకరు వికారం వచ్చినట్లు నటించి దుపట్టా లేదా పాలిథిన్ బ్యాగ్‌లోకి 'వాంతి' చేయడం ప్ర...

