Medaram | భక్తుల నమ్మకాలతో ఆటలాడొద్దు
ప్రతిపక్షాలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్
వరంగల్/ ములుగు : మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ చాలా పవర్‌ఫుల్ అంటూ ప్రతిపక్షాలు, కొన్ని రాజకీయ పత్రికలు దేవుడిపై రాజకీయాలు, తప్పుడు వార్తలు రాయడం సరికాదని మంత్రి సీతక్క హితవు పలికారు.
గత ప్రభుత్వం రూ.10 కోట్లతో చెక్ డ్యాములు కట్టి వాటిని కూల్చడానికి రూ.కోటి ఖర్చు చేసిందని, కానీ తమ ప్రభుత్వం అలా కాదని, పెట్టిన ప్రతీ రూపాయి శాశ్వతంగా నిలిచిపోయేలా కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు. ఈ ప్రాంత బిడ్డలుగా, ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నామని చెప్పారు. అధికారం కోసం, అలంకారం కోసం కాదు.. మా అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం భక్తుల విశ్వాసం కాపాడేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. మరో వారం రోజుల్లో పనుల అభివృద్ధి మీకే కనిపిస్తుందని, దేవుడి దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు.. రాజకీయాలు వద్దని వార్నింగ్ ఇచ్చారు. ములుగు జిల్లా (Mulugu) సమ్మక్క సార...


