Jubilee Hills |రేపే జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు.. సర్వత్రా ఉత్కంఠ
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరు
ఎగ్జిట్ పోల్స్ ఊపుతో కాంగ్రెస్‌లో ఉత్సాహం
Jubilee Hills Election Result | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) ఫలితం మరో కొన్ని గంటల్లో తేలనుంది. అధికా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. అయితే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తే, జూబ్లీహిల్స్‌పై జెండా ఎగరేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డింది. బీజేపీ కూడా సైలెంట్‌గా ప్రచారం జరిపి, తామే సర్ప్రైజ్ ఇస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.
సుమారు నెలరోజుల పాటు మూడు పార్టీలూ తమ టాప్ లీడర్లను నియోజకవర్గంలో కలియదిరిగారు. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో సాగిన ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సెగ రేపింది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్‌లో ఉత్సాహం
అయితే ఎగ్జిట్ ...

