Shocking Incident : టీనేజ్ యువకుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యువతులు
Shocking Incident in Punjab | ఓ టీనేజ్ యువకుడిపై నలుగురు యువతులు లైంగిక దాడికి పాల్పడిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో దేశంలో అమ్మాయిల భద్రతకే కాదు.. ఇక మీదట అబ్బాయిల భద్రత కూడా పెనుసవాల్ గా మారిందని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇటీవల రాత్రి సమయంలో ఈ యువతులు మద్యం మత్తులో ఒక టీనేజ్ యువకుడిని బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకున్నట్లు విచారణలో బయటపడింది. ఈ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో చోటుచేసుకుంది.
రాత్రంతా కారులో తిప్పుతూ అతనిపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాక.. నగర శివార్లలో పొదల్లోకి తీసుకెళ్లి అతనిపై లైంగికత దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అతడిని వదిలేసి పరారయ్యారు. మరుసటి రోజు అతను పోలీసుల దగ్గరకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కూడా కామంధులు మారడంలేదు. ...


