Sarkar Live

Day: November 24, 2025

Loans | మ‌హిళ‌ల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌
State, Hyderabad

Loans | మ‌హిళ‌ల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌

3.5 లక్షల మహిళా సంఘాల‌కు రేపు ₹304 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ Interest Free Loans in Telangana | రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు పెద్ద శుభవార్త. మొత్తం 3.50 లక్షల SHG మహిళలకు ₹304 కోట్ల వడ్డీలేని రుణాలను (Interest Free Loans) నవంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, CS రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ములుగు జిల్లా నుంచి పంచాయతీరాజ్ మరియు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ మాట్లాడుతూ.. నవంబర్ 25 ఉదయం 11 గంటలకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా రుణాలను పంపిణీ చేస్తామని తెలిపారు. మొత్తాలు నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని, పారదర్శకత కోసం ప్రతి సభ్యురాలికి ...
Dharmendra | బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
Cinema

Dharmendra | బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

Dharmendra | బాలీవుడ్ లెజెండరీ నటుడు, భారతీయ సినీ పరిశ్రమలో చెరగని ముద్రవేసిన ధర్మేంద్ర సోమవారం ముంబైలోని తన నివాసంలో 89 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. చిత్ర నిర్మాత కరణ్ జోహార్ భావోద్వేగంతో చేసిన సోషల్ మీడియా పోస్టు ద్వారా ఆయన మరణం ధృవీకరించారు. అయితే కుటుంబం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. డిసెంబర్ 8న ఆయన 90వ పుట్టినరోజు జరుపుకునే ముందు ఈ విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్రను నవంబర్ 10న బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, గోవింద వంటి పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రెండు రోజుల తర్వాత, కుటుంబ స‌భ్యులు ఇంటి నుంచే చికిత్స చేయాల‌ని కోరుకోవడంతో ధర్మేంద్రను నవంబర్ 12న డిశ్చార్జ్ చేశారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో చివరకు తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నటుడు ధర్మేంద్రకు ...
Death Mystery | నెల‌రోజులైనా వీడని మిస్టరీ!
State, Special Stories

Death Mystery | నెల‌రోజులైనా వీడని మిస్టరీ!

బీఆర్ఎస్ గ్రామ అధ్య‌క్షుడి మృతిపై ఇంకా తొల‌గ‌ని సందిగ్ధత Warangal News | గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌ 15వ డివిజన్‌ గొర్రెకుంటకు చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ల్యాదల్ల రాజు అలియాస్ లవ్ రాజ్ అనుమానాస్పద మృతి (Death Mystery) పై 30 రోజులు గడిచినా మిస్ట‌రీ వీడ‌లేదు. ద‌ర్యాప్తులోనూ ఎలాంటి స్పష్టత రాకపోవడం స్థానికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. గత నెల అక్టోబర్ 18న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజు మరుసటి రోజు 19న‌ ఉదయం మొగిలిచెర్ల శివారులోని చెట్ల పొద‌ల్లో విగ‌తజీవిగా కనిపించడం కలకలం రేపింది. రాజు స్వస్థలం గొర్రెకుంట అయినప్పటికీ అతని మృత‌దేహం మాత్రం మొగిలిచెర్లలో లభించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఒక పార్టీ గ్రామ‌ అధ్య‌క్షుడిగా అంద‌రికీ సుప‌రిచితుడు కావ‌డంతో గొర్రెకుంట, మొగిలిచెర్ల, పోతరాజుపల్లి, కీర్తిన‌గ‌ర్‌, జాన్‌పాక‌ సహా పరిసర గ్రామాల్లో ల‌వ్‌రాజ్ మ‌ర‌ణంప...
error: Content is protected !!