Sarkar Live

Day: November 26, 2025

Gold Price Today | మరోసారి తగ్గిన బంగారం ధరలు
Business

Gold Price Today | మరోసారి తగ్గిన బంగారం ధరలు

పసిడి మార్కెట్‌లో స్వల్ప పతనం Gold Price Today | న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆరంభం నుంచి వరుసగా పెరుగుతూ వినియోగదారులకు చుక్క‌లు చూపించిన‌ బంగారం ధరలు, ఇప్పుడు మెల్లగా తగ్గుముఖం పట్టుతున్నాయి. గత మూడు రోజులుగా పసిడి ధరలు స్వల్పంగా పడిపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.నవంబర్‌ 24న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,130 ఉండగా, ఇప్పుడు అది రూ.1,25,120కి తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,25,660, 22 క్యారెట్ల బంగారం రూ.1,15,190గా ఉంది. వెండి కిలో ధర అక్కడ రూ.1,70,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, దిల్లీ, హైదరాబాద్‌, తిరువ‌నంత‌పురం(కేర‌ళ‌), విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు రూ.1,25,120 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర సగటున రూ.1,14,690 చుట్టూ ఉంది. వెండి ధరలు మాత్రం నగరాన్ని బట్టి రూ.1,62,900 నుండి రూ.1,70,900 వరకు మారుతున్నాయి. కాగా బంగారం, వెండి ధరల...
Viral Video | ఆర్టీసీ బస్సులో మందుబాబుల హంగామా – డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి
Viral

Viral Video | ఆర్టీసీ బస్సులో మందుబాబుల హంగామా – డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి

Narsampet Viral Video | హైదరాబాద్‌–మహబూబాబాద్‌ ఆర్టీసీ బస్సులో ఇద్దరు చిత్తుగా మ‌ద్యం సేవించి వీరంగం సృష్టించారు. వరంగల్‌ వద్ద ఎక్కిన ఈ ఇద్దరు యువకులు నర్సంపేటకు టికెట్‌ తీసుకున్నప్పటికీ, అక్కడికి రాగానే దిగేందుకు నిరాకరించారు. కండక్టర్‌ వారిని దించేందుకు ప్రయత్నించగా రెచ్చిపోయారు. డ్రైవ‌ర్, కండక్ట‌ర్ ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. బస్సును పక్కన ఆపి ఆర్టీసీ సిబ్బంది మందుబాబులను దించేందుకు ప్రయత్నించడంతో, “నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దన్న” అంటూ యువకులు మరింత ఆగ్రహంతో ప్రవర్తించారు. డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి చేయడానికి య‌త్నించారు.ఇదంతా గమనించిన ప్రయాణికులు జోక్యం చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించిన వీడియో బస్సులో ఉన్నవారు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతోంది. Shocking: RTC బస్సులో మ...
error: Content is protected !!