Harish Rao | ‘మీ మాటలకు విలువ లేదు.. స్కాంలే తప్ప స్కీంలు లేవు’
పురుగుల అన్నంపై రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీష్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 'పురుగుల అన్నం' పెట్టిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఆయన ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వాగ్దానాలను హరీష్‌రావు గుర్తు చేస్తూ నిలదీశారు.
సమీక్షలు ఏమయ్యాయి?
"ఇక నుంచి నేనే సమీక్షలు చేస్తాను" అని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు ఏమయ్యాయి? గత 23 నెలలుగా మీ వద్దనే ఉన్న విద్యాశాఖపై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారు? "విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపుతాను" అని మీరు చేసిన బెదిరింపులు ఏమైపోయాయి? కల్తీ ఆహారం పెడుతున్న ఎంత మందిని మీరు జైలుకు పంపారు? ముఖ్యమంత్రి మాటలకు విలువ లేదని, ఆచరణకు దిక్...

