Maoist Surrender | మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: ఒకే రోజు 37 మంది లొంగుబాటు.. వారిపై రూ. 65 లక్షల రివార్డు
Maoist Surrender Dantewada : మావోయిస్టు పార్టీకి మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్, దంతెవాడ జిల్లాలో ఆదివారం, (నవంబర్ 30) ఏకంగా 37 మంది మావోయిస్టులు పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మొత్తం రూ. 65 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ 37 మందిలో 12 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.
'పూనా మర్గం'కు ఆకర్షితులై.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న 'పూనా మర్గం' (Puna Narkom - నక్సలిజం వీడి తిరిగి రండి) అనే ప్రచార కార్యక్రమానికి ఆకర్షితులై తాము లొంగిపోతున్నట్లు వారు ప్రకటించారు. తాము హింసామార్గాన్ని విడిచిపెట్టి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకముందని మావోయిస్టులు వెల్లడించారు.
లొంగిపోయిన మావోయిస్టులను దంతెవాడలోని డీఆర్‌జీ (DRG) కార...


