కరీంనగర్‌లో దారుణం: రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు – Planned killing
Karimnagar Murder Planned killing : అప్పులు తీర్చుకోవడానికి ఓ తమ్ముడు దుర్మార్గాన్ని ఎంచుకున్నాడు. రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్న(Elder Brother)నే పొట్టన పెట్టుకున్నాడు. మానసిక వైకల్యం (Mentally Challenged)తో ఉన్నాడనే కనకరం కూడా లేకుండా పక్కా ప్లాన్ ప్రకారం (planned killing) మరో ఇద్దరితో కలిసి హత్య చేశాడు. కరీంనగర్ జిల్లా (Karimnagar district) రామడుగు మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
వ్యాపార నష్టాలు.. పెరిగిన అప్పులు
నిందితుడు మామిడి నరేష్ మూడేళ్ల క్రితం రెండు టిప్పర్లు కొనుగోలు చేసి అద్దెకు నడుపుతున్నాడు. ఈ క్రమంలో వ్యాపారంలో వరుస నష్టాలు వచ్చాయి. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఒకవైపు వ్యాపారం సరిగా నడవకపోవడం, మరోవైపు అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో నరేష్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్...

