Sarkar Live

Day: December 5, 2025

Urea Shortage | తెలంగాణలో యూరియా కొర‌త‌పై కేంద్రం క్లారిటీ
State, Hyderabad

Urea Shortage | తెలంగాణలో యూరియా కొర‌త‌పై కేంద్రం క్లారిటీ

Availability of urea : ఖరీఫ్ సీజ‌న్-2025లో తెలంగాణ‌ (Telangana)కు యూరియాను రైతుల అవ‌స‌రాల‌కు అద‌నంగానే స‌ర‌ఫ‌రా చేశామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. యూరియా కొర‌త ఉండొచ్చ‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్న నేప‌థ్యంలో ఈ ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ‌లో యూరియా కొర‌త లేకుండా ప‌టిష్ఠ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని కేంద్ర ర‌సాయ‌న ఎరువుల శాఖ స‌హాయ మంత్రి అనుప్రియ పటేల్ (Minister of State for Fertilisers Anupriya Patel) తెలిపారు. ఈ రోజు లోక్‌స‌భలో కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి (MP Mallu Ravi) అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె ఈ మేర‌కు స‌మాధానం ఇచ్చారు. యూరియా కొర‌త‌పై క్లారిటీ ఖరీఫ్ సీజన్ (2025 Kharif season) సందర్భంగా తెలంగాణ రైతులకు అత్యంత కీలకమైన యూరియా ఎరువు (Fertiliser) సరఫరా గురించి కేంద్ర ప్రభుత్వం ఆశాజనకమైన సమాచారం ప్రకటించింది. యూరియా కొరత ఉండొచ్చని రైతులు అనుమానపడుతున్న సమయంలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఇచ్చిన...
Ayyappa Devotees | శంషాబాద్ RGIAలో అయ్యప్ప భక్తుల ఆందోళన
State, Hyderabad

Ayyappa Devotees | శంషాబాద్ RGIAలో అయ్యప్ప భక్తుల ఆందోళన

ఇండిగో కోచిన్ విమానం రద్దుపై తీవ్ర అసంతృప్తి.. నినాదాలతో మార్మోగిన ఎయిర్‌పోర్టు Ayyappa Devotees Protest : శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు బ‌య‌ల్దేరిన అయ్య‌ప్ప భ‌క్తులు (Ayyappa Devotees) హైద‌రాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (RGIA) వ‌ద్ద ఈ రోజు ఆందోళన‌ (Protest) కు దిగారు. కోచిన్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం ర‌ద్దు కావ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. షెడ్యూల్ ప్ర‌కారం గురువారం సాయంత్రమే బ‌య‌ల్దేరాల్సిన విమానం ర‌ద్దు అయ్యింది. దీంతో అయ్య‌ప్ప భ‌క్తులు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే వేచి ఉన్నారు. స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు కూడా విమానం బ‌య‌ల్దేర‌క‌పోవ‌డం అయ్య‌ప్ప (ayyappa) భ‌క్తుల అస‌హ‌నానికి కార‌ణ‌మైంది. విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందో ఎయిర్‌పోర్టు అధికారులు క్లారిటీ ఇవ్వ‌కపోవ‌డంతో నిర‌స‌న‌కు దిగారు. మ‌క‌ర జ్యోతి స‌మ‌యంలో శ‌బ‌రిమ‌లల...
Gorrekunta Murder Case | బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి హత్య మిస్టరీ: 45 రోజులు గడిచినా ఆధారాలు దొర‌క‌లేదా?
Special Stories

Gorrekunta Murder Case | బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి హత్య మిస్టరీ: 45 రోజులు గడిచినా ఆధారాలు దొర‌క‌లేదా?

వ‌రంగ‌ల్ జిల్లా గీసుకొండ మండలంలో క‌ల‌క‌లం రేపిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి అనుమానాస్పద మృతి (Gorrekunta Murder Case) కేసులో దర్యాప్తు మిస్టరీగానే కొనసాగుతోంది. ఈ ఘటన జరిగి సుమారు 45 రోజులు గడిచినప్పటికీ, ఈ హత్య మిస్టరీని ఛేదించడంలో పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది స్థానికుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ కేసులో ఏం జరుగుతోందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. జిల్లాలో అత్యంత సంచలనం సృష్టించిన మ‌ర్డ‌ర్‌ మిస్టరీలను కూడా అవలీలగా ఛేదించిన ట్రాక్ రికార్డు పోలీసు శాఖకు ఉంది. సుమారు ఐదేళ్ల క్రితం గొర్రెకుంట శివారులో ఏకంగా 9 మంది బావిలో శవాలై తేలిన మిస్టరీని చాకచక్యంగా ఛేదించిన ఘనత పోలీస్ శాఖకు ఉంది. అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నప్పటికీ, ప్ర‌తిప‌క్ష‌ పార్టీకి చెందిన గ్రామ అధ్యక్షుడు ల్యాదల్ల.రాజు(లవ్ రాజ్ )అనుమానాస్పదంగా మృతి చెంది 45 రోజులు గడిచినా కేసు మిస్టరీ ఎందుకు వీడటం లేదు అన్నది ప్రశ్న. ఈ...
ఇండిగో విమాన సేవలకు తీవ్ర అంతరాయం: దేశవ్యాప్తంగా 400+ విమానాలు రద్దు.. – Indigo Flight Cancellation
National

ఇండిగో విమాన సేవలకు తీవ్ర అంతరాయం: దేశవ్యాప్తంగా 400+ విమానాలు రద్దు.. – Indigo Flight Cancellation

హైదరాబాద్‌లోనూ కొనసాగుతున్న గందరగోళం Indigo Flight Cancellation | న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన కార్యకలాపాలు వరుసగా రెండో రోజు తీవ్ర అంతరాయానికి గురయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాలలో 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడిచినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒక్క‌సారిగా త‌లెత్తిన ఈ అంతరాయం కారణంగా వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన విమానాశ్రయాలలో రద్దుల సంఖ్య: ఢిల్లీ విమానాశ్రయం: 220కు పైగా విమానాలు రద్దు. బెంగళూరు విమానాశ్రయం: 100కు పైగా విమానాలు రద్దు. హైదరాబాద్ (RGIA): మొత్తం మీద 90కి పైగా విమానాలు హైదరాబాద్‌లో గందరగోళం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో గురు, శుక్ర‌వారాల్లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయ అధిక...
error: Content is protected !!