Flight cancellation impact : ప్రయాణికుల కోసం 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు!
Flight cancellation impact : ఇండిగో విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడం (Indigo flight cancellations)తో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, చైన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే వారు అసౌకర్యానికి గురవుతున్నారు. టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందుల్లో పడటంతో రైల్వే శాఖ (Indian Railways) తక్షణమే స్పందించింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.
విమాన ప్రయాణాలు రద్దు కావడం వల్ల సహజంగానే రైళ్లకు డిమాండ్ (Rail travel demand India) ఒక్కసారిగా పెరిగింది. రిజర్వేషన్ కౌంటర్లు, రైల్వే స్టేషన్లు, ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో బుకింగ్‌లు పెరిగి ప్రయాణికులకు అందుబాటు టికెట్లు దొరకడం కష్టమైంది. ఈ పరిస్థితిని గుర్తించిన రైల్వే శాఖ ప్రజలకు సౌకర...

