Bharat Future City లో మెగా ప్రాజెక్టులు: గ్రీన్ ఎనర్జీ, ఫిల్మ్ సిటీ, మోటార్‌స్పోర్ట్స్ & హెల్త్‌కేర్
Bharat Future City projects : తెలంగాణకు అత్యాధునిక హంగులు సంతరించుకోనున్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీకి అనేక కీలక మెగా ప్రాజెక్టులు (Mega Projects Telangana) రానున్నాయి. హైదరబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ (Green energy projects), స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులు భారీగా ప్రవేశిస్తున్నాయి.
రూ. 4 వేల కోట్లతో 25 బయోగ్యాస్ ప్లాంట్లు
గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా అహీరత్ హోల్డింగ్స్ సంస్థ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో శుభ్రమైన ఇంధన విప్లవానికి (CBG plants in Telangana ) నాంది పలికే ప్రాజెక్టును స్థాపించనున్నట్టు పేర్కొంది. మొత్తం 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణ...
