దీపావళికి అరుదైన గౌవరం-UNESCO జాబితాలో చోటు
భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన పండుగల్లో దీపావళి (Deepavali )ఒకటి. ఈ పర్వదినానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యునెస్కో తన ఇన్‌టాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ (Intangible Cultural Heritage – ICH) జాబితాలో చేర్చిందిఇ. డిల్లీలోని ఎర్రకోట (Delhi’s Red Fort)లో జరుగుతున్న UNESCO సదస్సులోఈ నిర్ణయం తీసుకున్నారు. యునెస్కో తన అధికారిక X పేజీలో ఈ ప్రకటన వెలువరించింది. భారతీయ సంస్కృతికి ప్రతిబింబమైన దీపావళికి ఈ అరుదైన గౌరవం దక్కడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అంతర్జాతీయ వేదికపై గొప్ప గుర్తింపు
యునెస్కో సదస్సుకు ఈసారి భారతదేశం ఆతిథ్యమిచ్చింది. ఈనెల 8న ప్రారంభమైన ఈ సదస్సు 13 వరకు కొనసాగనుంది. అంతర్జాతీయ ప్రతినిధులు (international representatives ), ప్రముఖ అతిథులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు కోస...

