Avatar 3 Review Telugu : పండోర ప్రపంచంలో సరికొత్త సెన్సేషన్.. జేమ్స్ కామెరూన్ మ్యాజిక్ రిపీట్ అయిందా?
Avatar 3 Review Telugu | 2009లో హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ 'అవతార్' సినిమాను పరిచయం చేసినప్పుడు, ప్రేక్షకులు ఆశ్చర్యంతో ఊపిరి బిగబట్టారు. ఆ అద్భుతమైన విజువల్స్ చూసి సినిమా ప్రేమికులు మంత్రముగ్ధులయ్యారు.. 13 ఏళ్ల తర్వాత వచ్చిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (2022) ఆ మ్యాజిక్‌ను కొనసాగించింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడవ భాగం 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసారి కామెరూన్ ఏ మేరకు ఆకట్టుకున్నారో ఈ రివ్యూలో చూద్దాం.
కథ: అడవి నుంచి నీటిలోకి.. ఇప్పుడు నిప్పు వైపునకు!
'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ముగిసిన చోటు నుండే ఈ కథ ప్రారంభమవుతుంది. టోరుక్ మక్టోగా పిలవబడే జేక్ సలీ (సామ్ వర్తింగ్టన్) తన కుటుంబంతో కలిసి అడవిని విడిచిపెట్టి 'నీటిని' తమ కొత్త నివాసంగా మార్చుకున్నాడు. అయితే, వారికి పండోరపై పొంచి ఉన్న ప్రమాదాలు ఇంకా తగ్గలేదు.
ఈసారి వారికి ఎదురయ్యే అతిపెద్ద ముప్పు '...
