Journalist | జర్నలిస్టుల ‘అక్రిడిటేషన్’ జీవోపై రగడ: 27న కలెక్టరేట్ల ముట్టడికి TUWJ పిలుపు!
జి.ఓ నంబర్ 252ను వెంటనే సవరించాలి
రెండు కార్డుల విధానం వద్దు.. 10 వేల కార్డుల కోతపై ఆగ్రహం
డెస్క్ జర్నలిస్టులకు, కేబుల్ ఛానళ్లకు అన్యాయం
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం జారీ చేసిన జి.ఓ నంబర్ 252 తీవ్ర లోపభూయిష్టంగా ఉందని, దీనివల్ల వేలాది మంది జర్నలిస్టులు తమ హక్కులను కోల్పోతున్నారని TUWJ (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ధ్వజమెత్తింది. ఈ అనాలోచిత జీవోను నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు భారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు యూనియన్ ప్రకటించింది.
మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, కోశాధికారి పి.యోగనంద్, టెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, ఐజేయు నేత అవ్వారి భాస్కర్ తదితరులు మాట్లాడారు.
జీవోలోని ప్రధాన లోపాలు - TUWJ అభ్యంతరాలు:...

