హైదరాబాద్‌లో ఘోరం : పిల్లల ముందే భార్యను తగలబెట్టిన భర్త.. అడ్డువచ్చిన కూతురిని కూడా మంటల్లోకి తోసి దారుణం!
Hyderabad Nallakunta Murder Case : నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గుండె తరుక్కుపోయే విషాద ఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ పండుగకు ముందు రోజు (డిసెంబర్ 24) తెల్లవారుజామున ఒక వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా పిల్లల ముందే పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ దారుణ ఘటనలో భార్య మరణించగా, తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నించిన చిన్నారికి గాయాలయ్యాయి.
ప్రేమ వివాహం.. అనుమానంతో వేధింపులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు త్రివేణి (26), నిందితుడు వెంకటేష్ నల్గొండ జిల్లా హుజురాబాద్ నివాసితులు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నరేష్, సాత్విక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా వెంకటేష్ తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను తరచుగా శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేసేవాడు. దీంతో త్రివేణి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయినప్పటికీ, వెంకటేష్ తన ప్రవర్తన మార్చుకుం...
