Rahul Gandhi | ప్రజాస్వామ్యమా.. రాచరికమా? కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు
న్యూఢిల్లీ : ఉపాధి హామీ పథకం (MNREGA) పేరు మార్పు మరియు దాని రూపురేఖలను మారుస్తూ కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ’ బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు.
యుపిఏ హయాంలో కోట్లాది మంది పేదలకు అండగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గాంధీజీ పేరును తొలగించడం జాతిపితను అవమానించడమేనని రాహుల్ అన్నారు. ఈ కీలక నిర్ణయాన్ని కనీసం కేబినెట్‌లో చర్చించకుండా, సంబంధిత శాఖా మంత్రులతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. "ఇది ప్రజాస్వామ్యమా? లేక ఒకే వ్యక్తి నిర్ణయాలు అమలు చేసే రాచరిక వ్యవస్థా?" అని రాహుల్ ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీకి గాంధేయ సిద్ధ...
