ATM Theft Gang | వరంగల్‌లో ఏటీఎం చోరీల ముఠా గుట్టురట్టు:
ఇనుప రేకులతో మాయాజాలం..
రాజస్థాన్ కేటుగాళ్లు అరెస్ట్!
కాజీపేట, డిసెంబర్ 28: ఏటీఎం యంత్రాల్లో చిన్న ఇనుప రేకును అడ్డం పెట్టి, ఖాతాదారులు డ్రా చేసే నగదు బయటకు రాకుండా అడ్డుకుని, ఆ తర్వాత ఆ సొమ్మును కాజేస్తున్న రాజస్థాన్ ముఠాను (ATM Theft Gang) వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సిసిఎస్ (CCS) మరియు కాజీపేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.నిందితుల నుంచి రూ. 5,10,000 నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, నేరానికి వాడే ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు. .
నిందితుల వివరాలు : అరెస్టు అయిన వారంతా రాజస్థాన్ రాష్ట్రం, అల్వార్ జిల్లా, మాల్కిడా తాలూకాకు చెందిన ఆరిఫ్ ఖాన్ (23), 2. సర్ఫరాజ్ (24), 3. ఎం. ఆష్ మహ్మద్ (29), 4. షాపుస్ ఖాన్ (33), 5. షారూఖాన్ (33), 6. అస్లాం ఖాన్ (33), 7. ఎం. షారుఖాస్ (27). మరో నిందితుడు ...
