సంక్రాంతి 2026: హైదరాబాద్ ఆకాశంలో పతంగులు, బెలూన్లు, డ్రోన్ల విన్యాసాలకు సిద్ధం - Kite Festival
International Kite Festival Hyderabad 2026 | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కేవలం వినోదానికే కాదు, ఆర్థిక, సాంస్కృతిక ప్రగతికి పర్యాటకాన్ని ఒక ప్రధాన చుక్కానిగా మార్చుకుంటోంది. 2026 సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ షో, డ్రోన్ షోలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి సిద్ధమైంది.
ప్రధాన ఆకర్షణలు ఇవే..
గగనతల విన్యాసాలు: 19 దేశాల నుండి 40 మంది అంతర్జాతీయ, 15 రాష్ట్రాల నుండి 55 మంది జాతీయ పతంగుల నిపుణులు పాల్గొంటున్నారు. రాత్రి వేళ ఆకాశంలో వెలుగులు చిమ్మే "నైట్ ఫ్లయింగ్" ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హైదరాబాద్‌లో స్థిరపడిన వివిధ దేశాలు, రాష్ట్రాల వారు తమ ఇళ్లలో తయారు చేసిన 1,200 రకాల మిఠాయిలను ఇక్కడ రుచి చూడవచ్చు.
అధునాతన డ్రోన్ షో:
గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ షోలో డ్రోన్లతో సాకర్ ...
