వాసం శ్రీనివాస్ కు .. ప్రొఫెసర్ గా పదోన్నతి…..
సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన విద్యావేత్త డాక్టర్ వాసం శ్రీనివాస్‌కు ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. ఉన్నత విద్యా కళాశాలల కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ పదోన్నతి అమలులోకి వచ్చింది. గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగి విద్యారంగంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఆయన విజయం కొత్తగూడెం గ్రామంతో పాటు సంగెం మండల ప్రజలకు గర్వకారణంగా మారింది.
సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన వాసం వీరస్వామి, సోమలక్ష్మి దంపతుల కుమారుడైన డాక్టర్ వాసం శ్రీనివాస్ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసి, కాకతీయ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా సాధించారు.
2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలో ఉత్తీర్ణులై రసాయన శాస్త్రంలో జూనియర్ లెక్చరర్‌గా తన ఉపా...

