నిజామాబాద్‌లో పొలిటికల్ వార్: కాంగ్రెస్ సీనియర్ నేత దారుణ హత్య! – Nizamabad Murder case
Nizamabad : జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఇందల్వాయి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపీ గురువారం దారుణ హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు చివరకు రక్తపాతానికి దారితీయడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కారుతో గుద్ది.. కత్తితో పొడిచి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా (Nizamabad ) ఇందల్వాయి మండల కేంద్రంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఇమ్మడి గోపీపై ఆయనకు బంధువైన సతీశ్ పక్కా ప్లాన్‌తో దాడి చేశాడు. తొలుత గోపీని తన కారుతో బలంగా ఢీకొట్టి కింద పడేశాడు. ఆ వెంటనే తేరుకునే లోపే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన గోపీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హత్య చేసిన అనంతరం నిందితుడు సతీశ్ నేరుగా పోలీస్ స్ట...

