Paddy Scam | అరవింద రైస్ మిల్లులో ఫిజికల్ వెరిఫికేషన్ జరిగేనా
పౌరసరఫరాల రికార్డు లకు మిల్లులోని ధాన్యం నిల్వలకు భారీ వ్యత్యాసం ..
Narsampet Aravinda Rice Mill Paddy Scam | నర్సంపేట పట్టణ శివారులోని అరవింద రైస్ మిల్లులో భారీ స్థాయిలో ధాన్యం నిల్వలు మాయమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రికార్డులకు, మిల్లులో ఉన్న వాస్తవ నిల్వలకు మధ్య పొంతన (Narsampet Paddy Stock Discrepancy) లేకపోవడంతో పెను దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే 'సర్కార్ లైవ్ (Sarkar Live)' కథనం ప్రచురించడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లోనే పౌరసరఫరాల శాఖ అధికారులు 'ఫిజికల్ వెరిఫికేషన్' (Physical Verification) చేస్తారని ప్రచారం జరుగుతోంది.
Paddy Scam : అక్రమ విక్రయాల కలకలం.. తేడాలు ఎక్కడ?
నర్సంపేట లోని అరవింద రైస్ మిల్ కు ప్రభుత్వం మిల్లింగ్ కోసం కేటాయించిన వేల క్వింటాళ్ల ధాన్యం లెక్కల్లో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం. రికార్డుల ప్రకారం...

