Telangana Budget 2026-27 : రూ. 3.24 లక్షల కోట్లతో ‘ప్రజా క్షేమం – సామాజిక న్యాయం’.. రైతులకు, విద్యకు పెద్దపీట!
Telangana Budget 2026-27 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ. 3,24,234 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ‘ప్రజా క్షేమం - సామాజిక న్యాయం’ అనే నినాదంతో సామాన్యుల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఈ బడ్జెట్ అద్దం పడుతోందని ప్రభుత్వం పేర్కొంది.
బడ్జెట్ స్వరూపం
మొత్తం బడ్జెట్: రూ. 3,24,234 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ. 2,34,406 కోట్లు
మూలధన వ్యయం: రూ. 47,267 కోట్లు
కొత్త రుణాలు: రూ. 73,383 కోట్లు (ప్రతిపాదిత)
Telangana Budget 2026-27 : ప్రధాన ఆకర్షణలు & పథకాలు
1. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం
ప్రతి పేద కుటుంబానికి ధీమా కల్పించేలా రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రకటించి...

