Suicide | కరీంనగర్‌లో తీరని విషాదం: భార్య మరణాన్ని తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు పిల్లలు!
SI Chandrashekhar Suicide Karimnagar | కరీంనగర్ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. తన భార్య మరణాన్ని తట్టుకోలేక ఒక ఎస్సై ప్రాణాలు తీసుకున్న ఘటన స్థానికులను కలచివేస్తోంది. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న దేశి చంద్రశేఖర్, శనివారం తన అత్తగారి ఇల్లు అయిన ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరి మృతి
ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య, మంగళవారం కరీంనగర్‌లోని తమ నివాసంలో గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె అంత్యక్రియలు పుట్టినిల్లు అయిన సీతంపేటలో నిర్వహించారు. శనివారం నాటికి దివ్య మరణించి ఐదు రోజులు కావడంతో, శాస్త్రబద్ధంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే "డ్రెస్ మార్చుకుని వస్తాను" అని చెప్పి చంద్రశేఖర్ గదిలోకి వెళ్లారు.
SI Suicide : తలుపులు బద్దలు కొట్టి చూడగా..
...
