Sarkar Live

Day: March 22, 2026

కాంగ్రెస్‌కు భారీ షాక్: పార్టీకి జీవన్‌ రెడ్డి గుడ్‌ బై.. రాజీనామా లేఖలో సంచలన నిజాలు! – Jeevan Reddy Resigns Congress
State

కాంగ్రెస్‌కు భారీ షాక్: పార్టీకి జీవన్‌ రెడ్డి గుడ్‌ బై.. రాజీనామా లేఖలో సంచలన నిజాలు! – Jeevan Reddy Resigns Congress

Jeevan Reddy Resigns Congress | ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ఉద్ధండుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణానికి స్వస్తి పలికారు. ఈ నెల మార్చి 25న తాను అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ, పార్టీని వీడటానికి గల కారణాలను వివరిస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 20 నెలల మానసిక క్షోభ: లేఖలో ఆవేదన తన రాజకీయ సహచరులు, అభిమానులను ఉద్దేశించి రాసిన లేఖలో జీవన్ రెడ్డి కీలక విషయాలను ప్రస్తావించారు. "గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానాలను ఎదుర్కొంటున్నాను. ఆత్మాభిమానాన్ని చంపుకుని, గౌరవం లేని చోట ఇంకా కొనసాగడం నా వల్ల కాదు. ఈ మానసిక క్షోభను అనుభవిస్తూ పార్టీలో ఉండలేను" అని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ నేత జీవన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రా...
భద్రకాళి మాడ వీధుల అభివృద్ధికి మేము అడ్డు కాదు – కానీ స్థానికులకు అన్యాయం చేస్తే సహించం 
warangal

భద్రకాళి మాడ వీధుల అభివృద్ధికి మేము అడ్డు కాదు – కానీ స్థానికులకు అన్యాయం చేస్తే సహించం 

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీరుపై చెరబండరాజు నగర్ కాలనీ వాసుల ధ్వజం హన్మకొండ: భద్రకాళి దేవస్థాన మాడ వీధుల అభివృద్ధి పేరుతో గత 23 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న బండ కార్మికుల కుటుంబాలను ఖాళీ చేయించి, బయటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చాలని చూడటం దుర్మార్గమని చెరబండరాజు నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్థానికేతరులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్యేను నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యేకు కాలనీ వాసుల సూటి ప్రశ్నలు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టా పొంది, అక్కడ నివసించే వారికే ఆ హక్కు వర్తిస్తుంది. కానీ, ఇక్కడ నివాసం లేని వారికి ఏ ప్రాతిపదికన లబ్ధి చేకూరుస్తున్నారు? కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు, ...
Building Construction Rules 2026 |  భవన నిర్మాణ నిబంధనల్లో భారీ మార్పులు: TDR వినియోగంపై కొత్త గైడ్‌లైన్స్!
Special Stories

Building Construction Rules 2026 | భవన నిర్మాణ నిబంధనల్లో భారీ మార్పులు: TDR వినియోగంపై కొత్త గైడ్‌లైన్స్!

Telangana Building Construction Rules 2026 | రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని, భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టి.డి.ఆర్ (TDR) వినియోగం, సెట్‌బ్యాక్ సడలింపులు, అదనపు అంతస్తుల అనుమతులపై సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. హై రైజ్ భవనాల కొత్త నిర్వచనం రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను సవరిస్తూ, ఇకపై 21 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను మాత్రమే 'హై రైజ్' (High-Rise) భవనాలుగా గుర్తించనున్నారు. దీనివల్ల మధ్యతరహా నిర్మాణాలకు నిబంధనల నుంచి కొంత ఉపశమనం కలగనుంది. అదనపు అంతస్తులకు గ్రీన్ సిగ్నల్ 2000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తుల నిర్మాణానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది: 40 ఫీట్ల రోడ్డు: 3 అదనపు అంతస్తుల వరకు అనుమతి. ...
error: Content is protected !!