పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద భారీ క్యూలు.. అసలు నిజం ఏంటి? ఇది వదంతా లేక వాస్తవమా? – Petrol Shortage
Petrol Shortage : గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ కొరత రాబోతోందన్న ప్రచారంతో వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి క్యూ కడుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ట్యాంకులు ఫుల్ చేయించుకోవడమే కాకుండా, క్యాన్లలో కూడా నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో పలు బంకుల్లో ‘నో స్టాక్’ (No Stock) బోర్డులు దర్శనమిస్తున్నాయి.
వదంతులకు కారణం ఏంటి?
అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ప్రచారం కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీనికి తోడు వంట గ్యాస్ సరఫరాలో కాస్త జాప్యం చోటుచేసుకోవడంతో పెట్రోల్, డీజిల్ కూడా దొరకదనే ఆందోళన ప్రజల్లో పెరిగిపోయింది. ఈ టెన్షన్‌తోనే వాహనదారులు ఒక్కసారిగా బంకులపై పడ్డారు.
Petrol Shortage...




