హైదరాబాద్‌లో మరో కల్తీ బాగోతం: నకిలీ ఐస్‌క్రీమ్ యూనిట్ సీజ్.. ఎక్స్‌పైరీ ఫ్లేవర్లతో తయారీ! – GHMC News
GHMC News Adulterated Ice Cream Hyderabad Raid | వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో నగరంలో కల్తీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ముషీరాబాద్‌లోని బాపూజీ నగర్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న "బ్లూ బెల్స్ ఐస్‌క్రీమ్" (Blue Bells Ice Cream) తయారీ కేంద్రంపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ మరియు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న పట్టాల అశోక్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన రసాయనాలతో రంగురంగుల ఐస్‌క్రీమ్‌లు!
తనిఖీల్లో వెల్లడైన దిగ్భ్రాంతికర నిజాలు ఇవే:
గడువు ముగిసిన ఫ్లేవర్లు: పైనాపిల్, సీతాఫల్ వంటి ఫ్లేవర్ ఏజెంట్లు ఎక్స్‌పైరీ డేట్ ముగిసినప్పటికీ వాటిని యథేచ్ఛగా వాడుతున్నారు.
సింథటిక్ రంగులు: ఐస్‌క్రీమ్‌లు ఆకర్షణీయంగా కనిపించడం కోసం హానికరమైన కృత్రిమ రంగులను వినియోగిస...
