ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కుంజ రాము: 22వ వర్ధంతి సభలో నేతల నివాళి
ఆదివాసీల స్వయం పాలన, హక్కుల పోరాటంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన గొప్ప నాయకుడు, ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ వ్యవస్థాపకుడు కుంజ రాము అని పలువురు ఆదివాసీ సంఘాల నేతలు కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మోకాళ్లపల్లె గ్రామంలో శనివారం కుంజ రాము 22వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఆయన పుత్రుడు కుంజ సూర్యం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు మరియు ఆదివాసీ తోటి తెగ నేతలు పాల్గొని రాము చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రాము ఆశయాలే సీతక్కకు మార్గదర్శకం: కొడప రఘు
ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ తోటి PVTG సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొడప రఘు మాట్లాడుతూ.. ఆదివాసీల అభ్యున్నతి కోసం పరితపించిన కుంజ రాము ఆశయాలను ఆయన సతీమణి, ప్రస్తుత రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కొనసాగిస్తున్నారని తెలిపారు. ఒక సాధారణ ఆదివాసీ మహిళగా ఉద్యమ బాట నుండ...
