హన్మకొండ రైస్ మిల్లుల ‘మాయాజాలం’: రూ. 3.5 కోట్ల ధాన్యం గల్లంతు.. – Hanamkonda Rice Mill Scam
Hanamkonda Rice Mill Scam Paddy Missing News : హన్మకొండ జిల్లాలోని కొన్ని రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు మాయమైతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు మిల్లర్లు ఆడుతున్న ‘మాయాజాలం’ బయటపదుతోంది. దామెర మండలం ల్యాదల్లలోని లక్ష్మిగణపతి, పంథినిలోని వైష్ణవి రైస్ మిల్లుల్లో సుమారు రూ. 3.5 కోట్లకు పైగా విలువైన ధాన్యం పక్కదారి పట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది.
"లక్ష్మిగణపతి" లో ఖాళీ సంచులే దర్శనం!
దామెర మండలం ల్యాదల్ల గ్రామంలో ని లక్ష్మిగణపతి రైస్ మిల్లులో రికార్డుల్లో ఉండాల్సిన ధాన్యానికి, మిల్లులో ఉన్న నిల్వలకు పొంతన లేదు. సుమారు రూ. 2 కోట్లకు పైగా విలువ చేసే ధాన్యం మాయమైనట్లు సమాచారం. అక్కడ ధాన్యపు రాశులకు బదులు కేవలం ఖాళీ సంచులే దర్శనమివ్వడం మిల్లర్ నిర్వాకానికి అద్దం పడుతోంది.
"వైష్ణవి "మిల్లులోనూ అదే బాట..
ఇక పంథిని గ్రామంలోని వైష్ణవి మిల్లు పరిస్థిత...
