Mining mafia |మైనింగ్ శాఖ నిబంధనలకు తూట్లు
ఈ సీ లేకుండానే గ్రానైట్, స్టోన్ క్రషర్ ల నిర్వహణ
హన్మకొండ జిల్లాలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా!
అధికారుల పాత్రపై అనుమానాలు?జిల్లాలో మైనింగ్ మాఫియా (Mining mafia) ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పర్యావరణ అనుమతులు (EC) గాలికి వదిలేసి, నిబంధనలను తుంగలో తొక్కుతూ గ్రానైట్ క్వారీలు, స్టోన్ క్రషర్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నా.. గనులు, భూగర్భ శాఖ అధికారులు మాత్రం కళ్లున్నా చూడని కబోదుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పర్యావరణ అనుమతులు లేవు.. నిబంధనలు అసలే పాటించరు
సాధారణంగా ఏదైనా గ్రానైట్ క్వారీ లేదా స్టోన్ క్రషర్ నిర్వహించాలంటే పర్యావరణ శాఖ నుంచి ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ (EC) తప్పనిసరి. కానీ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ అనుమతులు లేకుండానే మైనింగ్ సాగుతోంది. నిబంధనల ప్రకారం ఈ సి లేకుంటే క్వారీ...


