పార్టీ మారుతున్నాననేది ‘పిచ్చి’ ప్రచారం: ఈటల రాజేందర్
తాను భారతీయ జనతా పార్టీని వీడి పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. తనపై జరుగుతున్నది కేవలం "పిచ్చి ప్రచారం" అని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదు
నేను, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ పార్టీ మారుతున్నామన్న వార్తలు అవాస్తవమని ఈటల స్పష్టం చేశారు. "పార్టీ మారడం అంటే బట్టలు మార్చుకున్నంత సులభం కాదు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని నేను. పదవుల కోసం పద్దులు మోసే అలవాటు నాకు లేదు" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోని కొందరు వ్యక్తులే ఇటువంటి దుష్ప్రచారానికి ఊతమిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఆనాడు వినేవారే లేరు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను పార్టీ నుంచి బయటకు నెట్టి ఐదేళ్లు కా...
