ప్రభుత్వ భూమి మాయం: సర్వే నెం. 95లో అన్యాక్రాంతం!
వరంగల్ జిల్లా యంత్రాంగం ముక్కు కిందే విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. జిల్లా కలెక్టర్ నూతన కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న గీసుగొండ మండలం గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 95 లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. సుమారు 10 గుంటలకు పైగా భూమిని అక్రమార్కులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నా, రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పేదల నీడకు ఎసరు.. రూ. కోట్ల భూమి స్వాహా!
గతంలో ఇదే సర్వే నంబర్ 95లో అప్పటి ప్రభుత్వం సుమారు 600 మంది పేదలకు 'గరీబ్ నగర్' పేరుతో ఇళ్ల స్థలాలను కేటాయించింది. అయితే, గొర్రెకుంట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారుల కన్ను ఈ మిగులు భూమిపై పడింది. అధికారుల కళ్లు గప్పి, రాత్రికి రాత్రే హద్దులు చెరిపేసి.. భూమిని కలుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అధికా...




