నిప్పుకణిక.. సురేఖ: గృహిణి నుంచి కేబినెట్ మంత్రి వరకు.. వరంగల్‌కు ‘కొండంత అండ! – Konda Surekha
Konda Surekha Political journey | తెలంగాణ రాజకీయ యవనికపై ఆమె ఒక సంచలనం. బెదురు లేని మాట.. వెనకడుగు వేయని నైజం.. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా సాగే ప్రయాణం. ఆమే కొండా సురేఖ. సాధారణ గృహిణి స్థాయి నుండి రాష్ట్ర కేబినెట్ మంత్రి వరకు ఆమె ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా, రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఆమె తనదైన ముద్ర వేస్తున్నారు.
పోరాటాలే పునాదిగా.. రాజకీయ ప్రస్థానం
బీసీ బిడ్డగా సామాన్య కుటుంబంలో జన్మించిన సురేఖ, (Konda Surekha) రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తన భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు (Ex MLC Konda Muralidhar Rao) వెన్నుదన్నుతో రాజకీయాల్లో అజేయ శక్తిగా ఎదిగారు. 1995లో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆమె, వరుస విజయాలతో వరంగల్ రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా నిలిచారు.
తూర్పు ...
