Adani : అదానీకి భారీ ఊరట.. ‘ధారావి’పై దాఖలైన పిటిషన్ కొట్టివేత!
Adani | ముంబైలోని ధారావి పునరుద్ధరణ ప్రాజెక్టుకు అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు టెండర్ మంజూరును బాంబే హైకోర్టు (Bombay High Court) సమర్థించింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌ను ఈ రోజు కొట్టేసింది. అభ్యంతరాలకు బలమైన కారణాలు చూపకపోవడంతో దీన్ని తిరస్కరిస్తున్నామని చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ అమిత్ బోర్కర్ లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Adani Properties Private Ltd)కు టెండర్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ యూఏఈకి చెందిన సెక్లింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (UAE-based Seclink Technologies Corporation) సంస్థ ఈ పిటీషన్‌ను 2022లో దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన హైకోర్టు తన తీర్పును వెలువరించింది.
టెండర్ ఖరారుతో వివాదం
2022లో నిర్వహించిన 259 హెక్టార్ల ధారావి పునరుద్ధరణ ప్రాజెక్ట్ (Dhar...




