December Bank Holidays | డిసెంబర్ లో 17 రోజులు బ్యాంకులకు సెలవు.. జాబితా ఇదీ..
                    December Bank Holidays 2024 : బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్ ఏదైనా బ్యాంకుకు సంబంధించిన పని ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి.. ఎందుకంటే నవంబర్‌లో డిసెంబర్‌లో 17 రోజులు బ్యాంకులు మూసి ఉండడనున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలు ప్రభావితం కాకుంఆడ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI వంటి సేవలను మీరు ఉపయోగించవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన జాబితా ప్రకారం, డిసెంబర్‌లో రెండు,, నాలుగో శనివారాలు, ఆదివారాలతో సహా మొత్తం 17 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. జాతీయ సెలవులతో అన్ని బ్యాంకులు దేశవ్యాప్తంగా మూసివేయనున్నారు. అయితే ప్రాంతీయ సెలవులు నిర్దిష్ట రాష్ట్రం లేదా ప్రాంతానికి సంబంధించినవి కాబట్టి ఆయా రోజుల్లో సంబంధిత రాష్ట్రం లేదా ప్రాంతంలోని బ్యాంకులకు సెలవులను ప్రకటిస్తారు. కాబట్టి డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా 17 రోజులు బ్యాంకులు...                
                
             
								