PIL in SC to restrict Scenes | ఆ సీన్లను నియంత్రించండి.. సుప్రీంలో పిల్ దాఖలు
PIL in SC to restrict scenes : మన దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అనేక మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా యువత ఈ యాక్సిడెంట్లకు ఎక్కువగా బలవుతున్నారు. నిత్యం జరిగే ప్రమాదాలను పరిశీలిస్తే.. రోడ్డుపై బైక్ రైసింగ్, స్టంట్స్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ లెక్కచేయకుండా డ్రైవింగ్ చేయడం వంటి కరణాల వల్ల జరిగేవే ఎక్కువగా ఉంటున్నాయి.
సీన్లు చూసి.. స్టంట్లు చేసి..
దీనికి సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్, ఓటీటీ ( OTT) కంటెంట్, అడ్వర్టైజ్‌మెంట్స్‌లో చూపించే దృశ్యాలే కారణని అంటున్నారు సామాజిక వేత్తలు. ఈ సీన్లను చూసే యువత అలాంటి దుశ్చర్యలకు పాల్పడి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సునామీ ఆన్ రోడ్’ (Tsunami on Roads) అనే స్వచ్ఛంద సంస్థ (NGO) సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం (Public intere...




