Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి, ఇద్దరు గాయాలు
Mahabubnagar Accident News : మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ (Rajapur mandal) మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి (National Highway-44)పై ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాలు తెలిపిన వివరాల ప్రకారం…
హైదరాబాద్ (Hyderabad) నుంచి నంద్యాల (Nandyal) దిశగా వెళ్తున్న కారు అధిక వేగంతో ప్రయాణిస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. వేగాన్ని అదుపులో పెట్టుకోలేక ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. దీంతో రెండు కార్లూ నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో చిక్కేపల్లి గ్రామానికి చెందిన బీరాం రంజిత్‌కుమార్ రెడ్డి, అతని బంధువు హరిక అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ హైదరాబాద్ వైపు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.మరో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్య...




